అది 1966 వ సంవత్సరం మార్చి నెల, 10 వ తేదీ…సాయం సమయం…ఆస్తీకులులైన జనం, సాక్షాత్ శంకర స్వరూపం, నడిచే దైవం అయిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర మహా సరస్వతీ మహా స్వామి వారి అనుగ్రహ భాషణ లో మునిగి తేలుతున్న సమయం…
...."ఒరు పిడి అర్సి పోదుమ్" ...."ఒక్క పిడికెడు బియ్యం చాలు" ...అనే సరళిీ కృత - అద్భుత - బహుళ జనాచరణ యోగ్యమైన ఆధ్యాత్మిక మార్గ దర్శనం ఒక్కసారిగా సాక్షాత్కరించింది....
పరిషత్ సభ్యులారా!..స్వామివారి అనుగ్రహంతో మనం 2 వ సంవ్సరములో కొంత దూరం ప్రయాణించాం…స్వామి వారి అనుగ్రహానికి మరింత చెరువయ్యాం…వారి సూచనల మేరకు సనాతనధర్మ పరి రక్షకుకులమైన మనందరికీ సులభతరమైన మార్గం ఈ “రోజుకో పిడికెడు బియ్యం” కార్యక్రమం.. దీన జన హితం కోసం, లోకకళ్యాణం కోసం, గృహిణిగా మీరు ప్రతి రోజూ వండుకునేటప్పుడే ఒక్క పిడికెడు బియ్యం విడిగా తీసి శుభ్రంగా ఒక పొడిగా వుండే పాత్రలో భద్రపరచి…మన శ్రుతి కైంకర్యం కార్యక్రమానికి మీవంతు విరాళంగా సమర్పించమని విజ్ఞప్తి. దీనిని సరిగ్గా రెండవరోజు, అన్నార్తులైన వారికి మాధవసేవ గా రుచిగా శుచిగా వండించి వితరణ చేయుటకు పరిషత్ ఉద్యమించినది.!!!
మనమేంచేయాలి ?
శ్రుతి కైంకర్య శుభ సమయంలో మహాస్వామివారి అనుగ్రహాన్ని, వేదాపురుషుల ఆశీర్వచనాన్ని స్వీకరించి …
- ప్రతీ రోజూ పిడికెడు చొప్పున మీరు జమ చేసిన శుభ్రమైన బియ్యం (సుమారుగా 2కేజీలు)
- 100 గ్రాముల కంది పప్పు,
- 50 గ్రాముల శనగ పప్పు
లను కార్య నిర్వాహక మండలికి అందజేసి, యధా శక్తి, మీకు తోచినంత ధన సహాయం 10/- లేదా 20/- లేదా 50/- లేదా 100/- లేదా 500/- లేదా 1000/-…etc., హుండీ లో వేయడమే (ఈ ద్రవ్యం కూరలకి, packing సామాగ్రికి , వంటవారికి ,పనివారికి , ట్రక్ లేదా ఆటో వానికి .. )
Mehterçeşme su kaçak tespiti Yeraltı su kaçaklarını tespit etmek için yer penetran radar kullanılır. https://www.btgunlugu.com/author/kacak/