పరిషత్ ప్రారంభించిన నాటి నుంచి, వేగంగా సనాతన ధర్మ పరిరక్షణకై అనునిత్యం శ్రమిస్తూ పలు విధములైన ధర్మప్రబోధక కార్యాచరణములచే, బహు జనాదరణ యోగ్యముగా పురోగమిస్తున్నది.భారతావని బలం, కుటుంబ వ్యవస్థ. అనగా , సంబంధ బాంధవ్యాలతో కూడిన పిన్నలు మరియు పెద్దల సమూహం. పెద్దవారి అనుభవైకవేద్యమైన జ్ఞానం, కుటుంబంలో గల పిల్లలకి అప్రమేయంగా లభించడం, తద్వారా వారు, సర్వత్ర, వారి పనులలో ప్రతిభావంతులుగా రాణించడం మనకి తెలిసినదే. అట్టి కుటుంబ వ్యవస్థని మరింత బలోపేతం చేస్తూ, కుటుంబంలో గల అందరి క్షేమాన్ని పరిరక్షించడానికి స్వయంగా మహాస్వామి వారినే కుటుంబ పెద్ద గా స్వీకరింపజేయబోవు కార్యక్రమమే ‘స్వామినాధ కుటుంబం’. (కంచి పరమాచార్య స్వామి వారి పూర్వాశ్రమ నామం ‘స్వామినాధ’) అనగా కుటుంబములో అందరూ పరిషత్ సభ్యులైతే ఆకుటుంబం స్వామినాధ కుటుంబం అవుతుంది. అంటే స్వయంగా మహా స్వామివారు కుటుంబ పెద్దగా అందరినీ సన్మార్గంలో ఉంచుతారని పరిషత్ ప్రగాఢంగా విశ్వసిస్తోంది. కావున పరిషత్ అందరి సంక్షేమము ఆశిస్తూ, సభ్యులందరినీ స్వామినాధ కుటుంబ సభ్యులు గా మారాలని తద్వారా సనాతన ధర్మ ప్రచారం మరింత విస్తృతం గా విస్తరించాలని ఆకాంక్షిస్తోంది..
సనాతన ధర్మ పరిరక్షణ మీవంటి ప్రాజ్ఞుల,విజ్ఞుల, ఉదార మనస్కుల చే సమిష్టిగా తమ తనువు-మనసు-ధనము తో చేయు సహాయం వలన మాత్రమే సాధ్యం