Sanatana Rishiprokta Gayatri Maha Parishath

శృతి కైంకర్యం

పరిషత్, తన ఆశయ/లక్ష్య సాధనమైన వేద పరిరక్షణ లో భాగం గా, ప్రతీ మాసం , నడిచేదైవమైన పరమాచర్య స్వామి వారి జన్మనక్షత్రం అయిన ‘అనూరాధ’ నాటి ప్రదోష సమయం లో , “శృతి కైంకర్యం” (వేద పారాయణ ) కార్యక్రమాన్ని, కోరిన సభ్యుల ఇండ్లలో వేడుకగా నిర్వహిస్తున్నది .వేద వాజ్ఞ్మయ శబ్ద సృస్టి చే వచ్చు శబ్ద తరంగాల నడుమ మహస్వామి ప్రీతమనస్కులై వచ్చి వారి పరిపూర్ణ అనుగ్రహం తో ఈ ప్రాంగణ మరియు మన అంతః కరణ శుద్ధి జరిపి , ధార్మిక శక్తిని చేకూరుస్తారని పరిషత్ ప్రగాఢంగా విశ్వసిస్తోంది. వేద పారాయణ ద్వారా వేద ప్రచారము మరియు వేద శక్తి బహిర్గతమై, సనాతన ధర్మ పరిరక్షణ జరిగి మన ఈ ప్రాంతం సుభిక్షితం అవుతుంది ఎందుకటే “ధర్మొ రక్షతి రక్షితః” సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం అది మనల్ని రక్షిస్తుంది. పరషత్ చే జరుపబోవు “శృతి కైంకర్యం” కార్యక్రమం ప్రణాళికా బద్ధంగా నిర్వహింపబడుచున్నది. ప్రతీ సంవత్సరం యుగాది నుంచి మొదలిడి ప్రతీ మాసంలో ఋగ్వేద-యుజుర్వేద-సామవేద అధర్వ వేద వేదపరాయణా లు క్రమబద్ధం గా నిర్వహిస్తూ వార్షికోత్సవ సమయానికి చతుర్వేద స్వస్తి కార్యక్రమాన్ని యధా శక్తి నిర్వహిస్తుంది .

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping