పరిషత్, తన లక్ష్య సాధనమైన గో సంరక్షణ లో భాగం గా, గోశాల ను గుర్తించి , వాని ప్రాశస్త్యం ప్రచారం చేస్తూ , సభ్యుల చే తనువు-మనసు-ధన సహాయములను అందిస్తూ, గో ప్రేమికులకు తగు సూచనలనిస్తూ, పలువిధములుగా ప్రయత్నిస్తున్నది. పరిషత్ చే నిర్వహించబడు “గో దత్తత” కార్యక్రమం ద్వారా, కోరిన సభ్యులతో గోశాలలోగల ఆవుని అనుసంధానించి, తగు సూచనలతో ,గో సేవా తత్పరతను సభ్యునిలో పెంపొందిస్తుంది. గోశాలలో ఉండెడి సానుకూల శక్తి ద్వారా సభ్యుని ఆధ్యాత్మిక మరియు ధార్మిక శక్తి ద్విగుణీ కృతమయి వారి కుటుంబము మరియు వారు నివసించు ప్రాంతములు శక్తివంతములై సనాతన ధర్మ పరిరక్షణ జరిగి సుభిక్షితం అవుతుందని పరిషత్ ప్రగాఢంగా విశ్వసిస్తోంది. పరషత్ చే జరుపబోవు “గో దత్తత ” కార్యక్రమం ప్రణాళికా బద్ధంగా నిర్వహింపబడుచున్నది. ఒక ఆవు సంరక్షణకు నెలకు సుమారుగా 2500 ద్రవ్య వినియోగమవుతుంది. గోదత్తత యందు ఉత్సాహవంతులైన సభ్యులు 3 లేదా 6 నెలల లేదా సంవత్సర రుసుమును ఒకేసారి పరిషత్ ద్వారా గోశాలకు చెల్లించి, ప్రతీ నెల 2 లేదా 3 పర్యాయములు, వారు స్వయంగా గోశాలకు విచ్చేసి, వారి కి అనుసంధానించిన గోవుని యధాశక్తి సేవించుకోవచ్చు. గో వత్స ద్వాదశి పుణ్య సమయం లో పరిషత్ చే జరుపబడు గో పూజా మహోత్సవము నాడు తమ కుటుంబ సభ్యులందరితో ప్రత్యక్షము గ పాల్గొనవచ్చు. గో దత్తత స్వీకరించిన సభ్యుడు, తమ దత్తత ప్రమాణ కాలం ముగిసినంతనే , పునరుద్ధరించ వలసినది గా విజ్ఞప్తి.