పరిషత్, సంధ్యా సమయ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, సమాజంలో ఉపనయన అర్హత లేని స్త్రీ-బాల-యువ-వృద్ధులకు సంధ్యా వందన విధి ని ఉపదేశించు కార్యక్రమం “అందరికీ సంధ్యావందనం”. బ్రహ్మశ్రీ నేమాని సుబ్బారావు పంతులుగారు, గాయత్రీ మాహా మంత్రజప సాధనాతత్పరులై , బాసర-నైమిశారణ్య-కాశీ-శ్రీశైలం వంటి పుణ్య క్షేత్రాలలో తపోదీక్షబూని, గాయత్రీ మంత్రాన్ని అమ్మ సహాయంతో అక్షర కోటి జపించి, తత్ ఫలాన్నీ అమ్మ అనుజ్ఞ తో విశ్వకళ్యాణమునకై ధారపోసిన మహనీయుడు. అట్టి గురువుల చే సంధ్యా వందన ఉపదేశం ద్వారా అంతఃకరణ శుద్ధి జరిగి, ధార్మిక శక్తి ఇనుమడింపబడిన సాధకుని ద్వారా ఉత్పన్నమగు సానుకూల ప్రకంపనలచే అందరూ సన్మార్గ తత్పరులై , సనాతన ధర్మ పరిరక్షణ జరిగి లోకం సుభిక్షితం అవుతుందని పరిషత్ విశ్వాసం. పరిషత్, ఈ కార్యక్రమాన్ని, ప్రతిష్టాత్మకంగా, నిబద్దతతో బహుజన సమూహ ప్రాంతాలలో అనగా కనీసం 20 నుంచి 30 జిజ్ఞాసువులు లేదా , ఉత్సాహవంతులగు మరియు ఉపనయన అర్హత లేని స్త్రీ-బాల-బాలికా-యువ-వృద్ధులు గల ఇంటిలో లేదా అపార్ట్మెంట్ హాల్ లో లేదా కాలనీ కమ్యూనిటి హాల్ లో నిర్వహిస్తుంది. సంధ్యా ఉపాసన ప్రాముఖ్యత, సంధ్యావందన ఆచరణ విధి వివరంగా 20 నిముషాల వ్యవధిలో వివరించి ప్రతి నిత్యము వారిచే అచరింపజేయుటకు సంధ్యా వందన విధిని పుస్తకాన్ని కూడా ఉచితంగా ఇచ్చి ప్రోత్సహిస్తుంది.