Sanatana Rishiprokta Gayatri Maha Parishath
Loading Events

« All Events

  • This event has passed.

జపార్పణ వార్షికోత్సవం-2024

November 16, 2024 @ 5:30 pm - November 19, 2024 @ 10:00 am

జపార్పణ వార్షికోత్సవం

బ్రహ్మశ్రీ నేమాని సుబ్బారావు పంతులు ,(పూజ్య గురువుగారు)  గారు , తన మానసగురువులుగా శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారిని, మరియు జపగురువులుగా  శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య మహాస్వామి స్వీకరించి వారి  అనుగ్రహం తో ,గాయత్రీ  మాహా మంత్రజప సాధనాతత్పరులై , బాసర (2002) ,నైమిశారణ్య (2004) , కాశీ (2014)  మరియు శ్రీశైలం (2017) వంటి పుణ్య క్షేత్రాలలో మండల దీక్షల నాచారించి గాయత్రీ మంత్రాన్ని అమ్మసహాయంతో అక్షర కోటి జపించి, తత్ ఫలాన్నీ అమ్మ అనుజ్ఞ తో  విశ్వకళ్యాణమునకై  విశాఖపట్టణం HB కాలనీ లో  వున్న వేదమాత గాయత్రీదేవి గుడిలో 2018  నవంబర్ 18 వ తారీఖున అమ్మకే ధారపోసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆనాటి నుండి  శ్రీ గురువుగారు తమ శిష్యులతో ఈ జపార్పణ వార్షికోత్సవ సందర్భంగా, ఆ సంవత్సరం- అప్పటివరకు తాము సముపార్జించిన జపశక్తిని, లోక కళ్యాణాన్ని ఆశిస్తూ, వేదోక్త విధివిధానాన్ని అనుసరిస్తూ, హోమ-తర్పణ-అభిషేకాది క్రతువులచే అమ్మకు ధారపోసి, తమ శిష్యులైన మనకందరికీ జ్ఞాన మార్గా న్ని ప్రబోధిస్తూ, ఆదర్శప్రాయులై సనాతనధర్మ పరిరక్షణ లో ఇతోధికంగా కృషి చేయుచున్నారు.

కాగా, మన పరిషత్ వినూత్నంగా ఇట్టి పవిత్రమైన కార్యక్రమాలు ఆవిచ్చిన్నంగా కొనసాగించాలనే ఉద్దేశంతో, గురు కృప ఎంతో అవసరమని గ్రహించి,  శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి విగ్రహాన్ని గాయత్రీ మాత గుడిలో Nov 18th 2023 న ప్రతిష్టించిన విషయం మనందరికీ తెలిసినదే. కావున స్వామివారి సమక్షంలో జరగబోవు ఈ  కార్యక్రమం లో ప్రత్యక్షముగా పాల్గొను పరిషత్ సభ్యులంతా Nov 16 వ తేదీ, సాయంత్రం సికింద్రాబాదు స్టేషను నుండి  బయలుదేరి 17 ఉదయం విశాఖపట్టణం చేరుకుని, 17 మరియు 18 వ తేదీలలో   హోమ, అభిషేకాది క్రతువులను మరియు పూర్ణాహుతి నాచరించి, ఆనాటి రాత్రి గాని లేదా మారునాటి సాయంత్రం అనగా 19 వ తేదీ సాయంత్రం  విశాఖపట్టణం నుంచి బయలుదేరి తిరిగి సికింద్రాబాదు కు చేరుకుంటారు.

17 మరియు 18 తేదీలలో జరుగు కార్యక్రమాల వివరాలు సవిస్తరం గా త్వరలో మీ ముందుంచబడతాయి

పై కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన దాలచిన వారు, తమ వివరాలను (పేరు,వయస్సు, ఆధార్ నెంబర్ మరియు తిరుగు ప్రయాణము తేదీ 18 /19 ), ఈ నెల 21వ తారీఖు (ఆదివారం) సాయంత్రం 6 గంటల లోగా తెలియ జేయ ప్రార్ధన

గ్రూపు బుకింగ్ కొరకు పై వివరాలు కోరుతున్నాము…ఎవరి టికెట్ ఖర్చులు వారే చెల్లించవలెను.

https://forms.gle/VawzXSG54NGFrhM88

Details

  • Start: November 16, 2024 @ 5:30 pm
  • End: November 19, 2024 @ 10:00 am

Organizer

  • sanatanarishiproktagayatrimahaparishath.com
  • Phone 9182076137
  • Email sarigamaparishath@gmail.com
  • View Organizer Website

Venue

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping