
- This event has passed.
శృతి కైంకర్యం -వేడుక- ఆశ్వయుజ మాసం(యుజుర్వేద పారాయణం)-2024
October 7, 2024 @ 6:00 pm - 8:30 pm
సనాతన ఋషి ప్రోక్త గాయత్రీ మహా పరిషత్, తన లక్ష్య సాధనమైన వేద పరిరక్షణ లో భాగం గా, ప్రతీ మాసం , నడిచేదైవమైన పరమాచర్య స్వామి వారి జన్మనక్షత్రం అయిన ‘అనూరాధ’ నాటి ప్రదోష సమయం లో , “శృతి కైంకర్యం” (వేద పారాయణ ) కార్యక్రమాన్ని, కోరిన సభ్యుల ఇండ్లలో వేడుకగా నిర్వహిస్తున్నది .వేద వాజ్ఞ్మయ శబ్ద సృస్టి చే వచ్చు శబ్ద తరంగాల నడుమ మహస్వామి ప్రీతమనస్కులై విచ్చేసి వారి పరిపూర్ణ అనుగ్రహాన్ని అందిస్తారని పరిషత్ ప్రగాఢంగా విశ్వసిస్తోంది. వేద పారాయణ ద్వారా వేద ప్రాశస్త్యము అందరికీ తెలియజేయబడి, సనాతన ధర్మ పరిరక్షణ జరిగి మన ఈ ప్రాంతం సుభిక్షితం అవుతుంది.
సభ్యులెల్లరి , సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ పరిషత్ ఈ కార్య క్రమాన్ని విశేషంగా, ఈ ఆశ్వయుజ మాస శుక్ల చవితి అనగా 7 -10 -2023 నాటి ప్రదోష సమయంలో , BDL – 211, మోర్ సూపర్ మార్కెట్ వెనుక , LIG బస్స్టాప్ ,భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) లో , శ్రీ జితేంద్ర గారి స్వగృహం లో నిర్వహింపబడును. కావున భక్తులెల్లరూ విచ్చేసి వేద పురుషుని , వేదమాత గాయత్రి అమ్మవారి ఆశీస్సులు పొంది, పరమాచార్య వారి కృపకు పాత్రులుకాగలరని భక్త జన కోటికి విజ్ఞప్తి.
సమయం : సాయంత్రం 6|| గ0 || నుండి 7 || గ0 || 30 ని ల వరకు.
స్థలం: BDL – 211,Behind More Supermarket, Opp. LIG Bus stop, BHEL, Hyderabad – 502032 Ph: 9980906792.
google map link for the venue: https://maps.app.goo.gl/Jb5XWWBmB3TysARF6
కార్యక్రమం: శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి జన్మ నక్షత్ర దినము నందు , వారికిష్టమైన వేద పారాయణం (శుక్ల యుజుర్వేద పారాయణం)
సభ్యులందరికీ విజ్ఞప్తి : సభ్యులైన వారందరూ తమ సభ్యత్వపు చిహ్నం మరియు ధవళ వస్త్రములను ధరించి కార్యక్రమమునకు హాజరు కాగలరు.
https://forms.gle/QA94KxcDjs5yFvfD6